గొడుగులు పంపిణీ చేస్తున్న శ్రీనివాసరావు
ప్రజాశక్తి-బాపట్ల: పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో పట్టణంలో పాదరక్షలు కుట్టేవారిని, ఫుట్‌పాత్‌పై పాదరక్షలు అమ్మే వారిని కొంతమేర ఎండ బారి నుంచి కాపాడటానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ సహకారంతో ఆదివారం గొడుగులు పంపిణీ చేశారు. ప్రధానంగా పట్టణంలో రథం బజారులో ఫుట్‌పాత్‌పై చేతివృత్తులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని జీవించే అనిల్, కమలాకర్, సైమన్, అమీర్ లకు ఎండ నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు ఈ గొడుగులు పంపిణీ చేస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు అలపర్తి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ పూర్వ అధ్యక్షులు బూర్గుల సంగమేశ్వర శాస్త్రి, గోపాలం రఘుపతిరావు, కోశాధికారి వంకాయలపాటి హరిబాబు, తోడేటి రజనీకాంత్ పాల్గొన్నారు.










