ప్రజాశక్తి-పంగులూరు: చదువుకునే ప్రతి ఒక్కరికీ చేతిరాత ఎంతో ముఖ్య మని, చేతిరాత ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించే అవకాశం ఉందని గంగవరం వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరాం జనేయులు అన్నారు. ఆదివారం గంగవరం గ్రామం లోని మంచాల వెంకటరామయ్య, రంగమ్మ కళ్యాణ మండపంలో గంగవరం బాలల విద్యా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, ఇంగ్లీషులో చేతిరాతపై శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో వీరాంజ నేయులు మాట్లాడుతూ చేతిరాతను అందంగా నేర్చు కుంటే చూసేవారికి, చదివే వారికి బాగుంటుందని, విద్యార్థులు ఇంగ్లీషును చక్కగా రాయటం నేర్చుకునేం దుకు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో 8,9,10 తరగతులకు చెం దిన విద్యార్థులు పాల్గొన్నారు. గంగవరం గ్రామం లోని ఎయిడెడ్, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, చంద లూరు, పావులూరు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు 89 మంది పాల్గొన్నారు. వీరిలో 56 మంది ఆడపిల్లలే పాల్గొనడం ప్రధాన అంశం. కార్యక్రమానికి పీ గిరిబాబు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండి బోధించారు. శంకరాపురం రాజా రమేష్ బృందం అభ్యుదయ గీతాలను వినిపించారు. ఈ కార్యక్రమానికి అమరజీవి కరి మార్కండే యులు స్మారక అర్థం ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం అందించారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం కూడా శిక్షణ కార్యక్రమం ఉంటుందని వేదిక కన్వీనర్ ఆత్మకూరు సుబ్బారావు తెలిపారు.










