May 23,2023 19:53

మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో దర్గా వద్ద చేతిపంపునకు మెకానిక్‌ పౌలయ్య మంగళవారం మరమ్మతులు చేశారు. మాజీ ఎంపిటిసి ఎల్లప్ప ఆధ్వర్యంలో చుట్టుపక్కల కాలనీవాసులు సహకారంతో బోరును బయటకు తీసి మెకానిక్‌ పౌలయ్య మరమ్మతులు చేశారు. అనంతరం చేతి పంపు నుంచి తాగునీరు రావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఆశాదీప్తి పాల్గొన్నారు.