Jan 23,2023 23:55

మాట్లాడుతున్న ఎర్రా దేముడు

ప్రజాశక్తి-కె.కోటపాడు : విజయవాడలో ఈనెల 30వ తేదీన జరగనున్న చేతి వృత్తిదారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ ఎర్ర దేవుడు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం చేతి వృత్తిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వృత్తిదారుని కుటుంబానికి రూ.25వేలు ఆర్థిక సాయం అందించాలని, 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ప్రమాదంలో మరణించిన వృత్తిదారుని కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వృత్తిదారుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, కులగణన చేపట్టి వృత్తిదారుల జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని, మత్స్యకారుల జీవితమ నాశనం చేసే జీవో 217ను రద్దు చేయాలని, చేతి వృత్తులపై జిఎస్‌టి పూర్తిగా రద్దు చేయాలని, జీవో నెంబర్‌ 27 ప్రకారం అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను భర్తీ చేయాలని, గొర్రెలు మేకలకు ఏడాదికి నాలుగు సార్లు డి వార్మింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటి సాధన కొరకు జరుగు రాష్ట్ర సదస్సులో వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని కోరారు.