రణస్థలం: మీనామృత తయారీ దినోత్సవాల్లో భాగంగా మండలం పరిధిలో 14 గ్రామ పంచాయతీల్లో ఆదివారం 120 లీటర్లు మీనామృతం తయారు చేసి రైతులు అవగాహన పరిచారు. ఈ సందర్భంగా నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్ శివాజీ మాట్లాడుతూ ఎకరాకు మీనామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు, వస్తువులు రెండు కిలోల చేపల వ్యర్థాలు, రెండు కిలోల బెల్లం, కుండ, డ్రమ్ము, పలచటి గుడ్డ ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో నేచురల్ ఫార్మింగ్ మాస్టర్ ట్రైనర్ కంబపు కృష్ణ, సబ్ డివిజనల్ యాంకర్ గంట్యాడ రాంబాబు, యూనిట్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.
లావేరు : మండలంలోని బెజ్జిపురంలో ఆదివారం చేపల వ్యర్థాలతో మీనామృతం అనే ద్రావణాన్ని తయారు చేయించారు. ప్రకతి వ్యవసాయ సిబ్బంది ఎన్‌ఎఫ్‌ఎ శివాజీ, అప్పారావు, డిజిటల్ రాంబాబు మాట్లాడుతూ ఈ ద్రావణం తయారీకి 1:1 నిష్పత్తిలో చేపల వ్యర్థాలు, బెల్లం తీసుకొని రెండింటిని ఒక కుండలో వేసుకొని రెండు పూటలా కలుపుకోవాలన్నారు. ఈ విధంగా ఈ ద్రావణం 15 రోజులకు తయారవుతుందన్నారు. ఈ మిశ్రమాన్ని పిచికారీ చేయడం వల్ల పంటలు ఎదుగుదలకు, దిగుబడి పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆమదాలవలస : మండలంలోని గరిమెళ్లకొత్తవలసలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యాన రైతులు మీనామృతం ద్రావణాన్ని తయారు చేశారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్‌ఛార్జి నక్క చిరంజీవిరావు, సిబ్బంది తిరుపతిరావు, జానకిరామ్ పాల్గొన్నారు.










