
ప్రజాశక్తి - పాలకొండ : చేపల పెంపకం ద్వారా గిరిజనులు మరింత ఆర్థికంగా అభివృద్ధి కావాలని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గిరిజన మత్స్యకారులకు ఐటిడిఎ ప్రత్యేక కేంద్ర సహాయ నిధులు గిరిజన ఉపప్రణాళికలో భాగంగా శనివారం స్థానిక నగర పంచాయతీ పరిధిలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి చెరువులులోకి విడిచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం గిరిజన మత్స్యకారులకు ఎంతో దోహదపడుతుందని, కావున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ యందవ రాధకుమారి, జిల్లా మత్స్యకారు అధికారి తిరుపతయ్య, పిహెచ్‌ఒ గణేష్, ఎఫ్‌డిఒ గోపీకృష్ణ, కౌన్సిలర్ల వెళ్లవల మన్మధరావు, కడగల రమణ ఉన్నారు.
సీతంపేట : ఎస్టీ ఫిషర్స్‌కు స్థానిక ఐటిడిఎ ప్రత్యేక కేంద్ర సహాయ నిధులు గిరిజన ఉప ప్రణాళిక పథకం ద్వారా సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మండలంలోని లోకొత్తవలస, వాబ, కుసిమి, గోయిది పంచాయతీలు చెందిన చెరువుల్లో 42వేల 200చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, విఎఫ్‌ఎ విజేత తదితరులు, గిరిజన మత్స్యకారులు పాల్గొన్నారు.