Sep 30,2022 23:25

మాట్లాడుతున్న మత్స్యశాఖ జెడి సుమలత

ప్రజాశక్తి -భీమునిపట్నం : చేపల పెంపకందారులకు మార్కెటింగ్‌ రంగంలో మెలకువలపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. నాలుగోవార్డు చేపలుప్పాడ, కొత్తూరు, పిసిఆర్‌ ఆక్వా ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుమలత మాట్లాడుతూ, చేపల పెంపకంలో సమస్యలను ఎలా అధిగమించాలనే దానిపై వివరించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ మత్యకార సొసైటీల బలోపేతంపై సూచనలు చేశారు.. ఎఫ్‌డిఒ లావణ్య మాట్లాడుతూ చెరువు చేపలకు మార్కెట్‌లో మంచి ధర లభించే అవకాశాలను వివరించారు. ఎస్‌విడిఎస్‌ కోఆర్డినేటర్‌ కె అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎపి సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం ఎపిడి భాస్కరదేవ్‌, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కృష్ణ, శారద వ్యాలీ డెవలప్‌మెంట్‌ సమితి నాయకులు జి ఎల్‌ నాయుడు, భీమిలి మండలం తాటితూరు, పద్మనాభం మండలం పొట్నూరు, పాండ్రంగి ప్రాంతాల చేపల పెంపకందారులు పాల్గొన్నారు.