Feb 27,2023 21:44

ప్రజాశక్తి - కలిదిండి 
              మండలంలోని సానా రుద్రవరం హరిజనవాడకు ఆనుకుని చేపల చెరువు తవ్వకం పనులను నిలిపివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జక్కుల మహేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌ తేజోమణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జక్కుల మహేష్‌ మాట్లాడుతూ హరిజనవాడకు ఆనుకుని చేపల చెరువు తవ్వకం చేపట్టడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నార న్నారు. ఇళ్ల పక్కనే ఉన్న వ్యవసాయ భూమి చేపల చెరువుగా మారితే గ్రామంలోకి మురుగు నీరు చేరి ముంపునకు గురవుతామని భయాందోళన చెందుతు న్నారన్నారు. అంతేకాకుంగా గ్రామస్తులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. సుమారు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని చేపల చెరువుగా తవ్వేందుకు పనులు చేపట్టారన్నారు. విచారణ చేసి ఈ తవ్వకం పనులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్‌తో పాటు గ్రామస్తులు మారుపూడి కుమార్‌, దాసరి సురేష్‌, కిషోర్‌, వినోద్‌, చింతల దాసు, అశోక్‌, బంగార్రాజు, డి.ప్రతాప్‌, బి.దావీదు పాల్గొన్నారు.