ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
చేనేతలందరికీ రుణాలు అందజేయాలని వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం చేనేత పట్టణ కమిటీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. చేనేత సంఘం నాయకులు భరణి, కాలప్ప, టైలర్ లక్ష్మణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గురు శేఖర్, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మన్న, జిల్లా కార్యదర్శి కె.రాజు మాట్లాడారు. చేనేత కార్మికులకు పూచీకత్తు లేకుండా రూ.లక్ష బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. మూడు సెంట్ల స్థలమిచ్చి ఇల్లు నిర్మించాలని, అర్హత ఉన్న చేనేత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత పని కల్పిస్తున్న మాస్టర్ వీవర్లకు కూడా వారి స్తోమతను బట్టి రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. పట్టు, నూలు, జరీ రంగులపై జిఎస్‌టి తొలగించాలని తెలిపారు. సిఐటియు నాయకులు రాముడు, జిపి.వీరన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గురు శేఖర్










