ప్రజాశక్తి-చీరాల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు తీరని అన్యాయం చేస్తున్నట్లు ఆలిండియా వీవర్స్ పెడ˜రేషన్ నాయకులు అన్నారు. ఆదివారం స్థానిక నల్లగాంధీ బొమ్మ సమీపంలోని కళ్యాణ మండపంలో చేనేతల సన్నాహక సమావేశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం చేనేత వర్గానికి చెందిన వారున్నట్లు పేర్కొన్నారు. కానీ ఏరంగంలో కూడా వారికి సరైన ప్రాధాన్యత కల్పించకుండా ఆణచివేస్తున్నట్లు ఆరోపించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారికి ప్రాధాన్యత లేదన్నారు. ఎన్నికల సమయంలో వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కనీసం ఎస్సీ, ఎస్టీల మాదిరిగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలపై పోరుబాటకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం జడ్‌పిటిసి బండ్ల తిరుమలదేవి, చీరాల జడ్‌పిటిసి ఆకురాతి పద్మిని, మాజీ జడ్‌పిటిసి పృథ్వీ అరుణకుమారి, నాయకులు బండారు వరప్రసాద్, గుంటి శ్రీనివాసరావు, గోలి గిరి, చంద్రమౌళి తదితర నాయకులు పాల్గొన్నారు.










