మంగళగిరి: చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19 వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణ యించారు. వేములపల్లి శ్రీకృష్ణ భవన్‌లోని చేనేత కార్యా లయంలో చేనేత ఐక్య కార్యాచరణ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరావు లు మాట్లాడుతూ చేనేతల న్యాయమైన డిమాం డ్ల సాధన కోసం 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించి,కలెక్టరకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ధర్నా కార్య క్రమాల్లో నేతన్నలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయ ప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే,మంగళగిరిలో ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19న గుంటూరులో కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివెళ్లాలని సమా వేశంలో నిర్ణయించారు.16వ తేదీన మంగళగిరి ప్రాంతంలో ని మగ్గాల షెడ్ల వద్దకు వెళ్ళి కరపత్రాల ద్వారా, 17న మైకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, కూర పాటి కోటేశ్వరరావు, దొడ్డి ఈశ్వరరావు, డోకి పర్తి రామారావు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










