ప్రజాశక్తి - ఆదోని
అనేక పథకాలు ప్రవేశపెట్టి చేనేతల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (లేపాక్షి) ఛైర్మన్ బడిగించల విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైసిపి నాయకులు బడిగింజల చంద్రమౌళి తెలిపారు. బుధవారం పట్టణంలో తొగటవీర క్షత్రియుల ఆహ్వానం మేరకు శ్రీచౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం అందరికీ అందుతున్నాయా తదితర విషయాలపై చర్చించారు. చేనేత అనుబంధ కళాకారులకు కూడా వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం వర్తింపజేయాలని కోరారు. తొగటవీర క్షత్రియ సేవా సంఘం ఆదోని అధ్యక్షులు పెరుమూర్ల రామచంద్రప్ప, ప్రధాన కార్యదర్శి కడబూరు పూడూరు రాజగోపాల్, గూడ గ్యానప్ప, పూడూరు సుజాత, మేకల పంకజాక్షి, పలువురు మహిళా తోగటవీరులు, కర్నూలు లేపాక్షి ఎంపోరియం మేనేజర్ తిమ్మయ్య, సిబ్బంది కిషోర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్ర మౌళి










