Nov 07,2023 01:11

చేనేత వస్త్రధారణతో విధులకు హాజరైన జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌, ఇతర అధికారులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాకు చెందిన అధికారులంతా నెలలో మొదటి సోమవారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించి తమ కార్యాలయాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ సహా జిల్లా అధికారులు చేనేత వస్త్రాలను ధరించారు. చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.