ప్రజాశక్తి -పిఎం.పాలెం : దేశ విదేశాలలో చేనేత ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మధురవాడ శిల్పారామంలో రాష్ట్ర ప్రభుత్వ అఖిల భారత హ్యాండ్లూమ్ వస్త్ర ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు శిల్పారామంలో ఆలిండియా హ్యాండ్లూమ్ మేళా 2022 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70 మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నో రకాల డిజైన్లతో, ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన ఉత్పత్తులు తక్కువ ధరలకే అందిస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఒ శ్యామ్‌సుందర్‌రెడ్డి, టిఎస్‌ఎన్.రెడ్డి, ఎఒ విశ్వనాథ్‌రెడ్డి, నగరాల కార్పోరేషన్ చైర్మన్ పిల్లా సుజాత, సత్యనారాయణ, వార్డు అధ్యక్షుడు బొట్ట, గాదె రొషిరెడ్డి, అప్పలరాజు, పిల్ల రమణ, పోతిన మూర్తిబాబు, శియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.










