మాట్లాడుతున్న చేనేత నాయకులు
ప్రజాశక్తి-చీరాల: చేనేత రంగం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నూలు, రంగులు, రసాయనాలు, మార్కెట్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని చేనేత సంఘాలను ఒకే చోటికి చేర్చి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలని చేనేత నాయకులు అన్నారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో చేనేత సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం చీరాల అంబేద్కర్ భవన్‌లో జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలోని చేనేత సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహనరావు, శీలం వెంకటేశ్వర్లు, పి కొండయ్య, మేడా వెంకట్రావు, గుద్దంటి ఆదిలక్ష్మి, తారక రామారావు, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.










