Jun 26,2023 00:01

పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి :నక్కపల్లిలో నేతన్న నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న మగ్గాలను చేనేత శాఖ ఏడి మురళీకృష్ణ, డివో రమణమ్మ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో గత ఏడాది నేతన్న నేస్తం పథకానికి 250 మగ్గాలకు అర్హత కలిగి ఉన్నాయన్నారు. ఈ ఏడాది 270 దరఖాస్తులు వచ్చాయని, వాటిలొ 20 వరకు అనర్హత ఉన్నట్లు గుర్తించామన్నారు. అర్హులందరికీ నేతన్న నేస్తం పథకం కింద ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున ఖాతాల్లోకి నగదు జమ చేస్తారన్నారు. సొసైటీ ఇన్చార్జ్‌ నాగబాబు, వార్డ్‌ మెంబర్‌ బంగారు రాజు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.