Nov 16,2023 23:24

ప్రజాశక్తి - భట్టిప్రోలు
చేనేత కార్మికులకు పెరిగాన నిత్యవసరాలకు అనుగుణంగా మజూరి పెంచాలని చేనేత కార్మిక సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు గొట్టుముక్కల బాలాజీ, మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఉమ్మడి రేపల్లె పాత తాలూకా పరిధిలోని సొసైటీలలో మజూరీలు పెంచినప్పటికీ ప్రస్తుతం పెరిగిన నిత్యవసర ధరలతో కార్మికుల జీవనోపాధి కరువైందని అన్నారు. మాస్టర్ వివర్లు, సహకార సంఘాలు వస్త్ర తయారిపై మజురిని పెంచి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకొని కార్మికులకు ఉపాధి అందటం లేదని అన్నారు. అరకొరగా తయారు చేసే వస్త్రాలకు మజూరి తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక అనేక మంది కార్మికులు పస్తులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మర్రివాడ వెంకటరావు, దీపాల సత్యనారాయణ, దొంతు కోటేశ్వరరావు, బట్టు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.