Aug 19,2023 20:58

చేనేత ప్రదర్శనను ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాష

 కడప అర్బన్‌ చేనేత, హస్తకళలను ఆదరించాలని డిప్యూటీ సిఎం అంజా ద్‌బాష కోరారు. శనివారం నేక్‌ నామ్‌ ఖాన్‌ కళాక్షేత్రంలో కళాభారతి చేనేత, హస్తకళల ప్రదర్శనను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పిన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రస్తుతం పాశ్చాత్య విష సంస్కృతికి బలైపోకుండా, మన దేశ సంస్కృతి, సాంప్రదాయల మేళవింపు గల వారసత్వ కళలకు జీవం పోస్తుందని తెలిపారు. దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేతలు, హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలన్నారు. చేనేత వస్త్రాలు పోచంపల్లి, బెడ్‌షీట్స్‌, డ్రస్‌ మెటీరియల్స్‌ శారీస్‌, కళంకారి, ఖాదీ వస్త్రాలు, మంగళగిరి చీరలు, బ్లౌజు మెటిరీయల్స్‌, వరంగల్‌ టవల్స్‌, లుంగీలు, హైదరాబాద్‌ ఎంబ్రాయిడరీ చీరలు, గద్వాల్‌, చీరాల డ్రెస్‌ మెటీరియల్స్‌, చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హస్తకళలు సంబంధించి కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, హైదరాబాద్‌ మంచి ముత్యాలు, ఖాదీ గ్రామోడ్యోగ్‌ ఆయుర్వేద ఔషధాలు, హైదరాబాద్‌ బంజారా ఉత్పత్తులు, లెదర్‌ బ్యాగ్‌లు, జ్యూట్‌ బ్యాగులు, ఇమిటేషన్‌ జ్యూయలరీ, అలంకరణ పుష్పాలు అందుబాబులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కళాభారతి అధ్యక్షులు జెల్ల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి శనిగరం.కిశోర్‌, కార్పొరేటర్‌ అజ్మతుల్లా, షఫీ, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.