చేనేత కార్మికుల కరపత్రాల ప్రచారం
ప్రజాశక్తి-వేటపాలెం: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పలువురు చేనేత నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పందిళ్లపల్లి, రామన్నపేట, కొనిచేటి చేనేత పూరి గ్రామాలలో చేనేతలతో గ్రూప్ సమావేశాలు నిర్వహించారు. చేనేత నిల్వలను కొనుగోలు చేయాలని, 11 రకాల చేనేత రిజర్వేషన్‌ను పటిష్టంగా అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు కరపత్రాల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నుంచి పి కొండయ్య, జన సమైక్య దేవన వీర నాగేశ్వరరావు, జాతీయ చేనేత ఐక్య సంఘం నుంచి శిలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










