చేగువేరా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు
ప్రజాశక్తి-శృంగవరపుకోట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చే గువేరా వర్థంతి సభను ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1,2 విభాగాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా చెగువేరా చిత్రపటానికి పుష్పాలతో నివాళి ఘటించారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్.కేశవరావు మాట్లాడుతూ సమాజంలో అంతరాలు పోగొట్టడానికి కృషి చేసిన పోరాట యోధుడు చేగువేరా అని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వాసుదేవరావు, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ జి.ఈరన్న, ఐక్యూఎసి కో-ఆర్డినేటర్ వి.సుధీర్, అధ్యాపకులు రేచర్ల శ్రీలక్ష్మ్మి, వి.స్వామి నాయుడు, పి.భాస్కర్‌రావు, సురేష్, ప్రసాద్, అప్పలరాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.










