Oct 25,2023 23:41

చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి, నారాకోడూరు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ భూముల బౌండరీలను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కె వి గోపాలకృష్ణ మాట్లాడుతూ నారాకోడూరులోని ఎలక్ట్రికల్‌ ఎంప్లాయిస్‌ కాలనీ సమీపంలో ఉన్న కుంట పోరంబోకు భూమిని, నారాకోడూరు-గుంటూరు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన నారాకోడూరులోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం కేటాయించిన 173 స్థలాలకు చెందిన భూములను, వడ్లమూడి గ్రామ పరిధిలోని క్వారీ భూములలోని 40.43 ఎకరాల సంబంధించి భూములను పరిశీలించారు. వడ్లమూడి క్వారీ భూములు 40.43 ఎకరాలను అలైనేషన్‌ కోసం విజ్ఞాన కళాశాల యాజమాన్యం కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల పరి శీలనలో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.కె అజీజ్‌, మండల సర్వేయర్‌ ఆంజనేయులు, వీఆర్వోలు సాంబశివరావు ఎం.సుధాకర్‌ పాల్గొన్నారు. క్వారీ భూముల పరిశీలనకు ఉన్నతాధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న టిడిపి నాయకులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జెసి మాట్లా డుతూ గతంలో జరిగిన పంచాయతి తీర్మానం మేరకు క్వారీ భూముల్లో బిసి బాలిక హాస్టల్‌, వాటర్‌ ట్యాంక్‌ నిర్మిస్తామని, వేరే ఎవరికి ఈ స్థలం కేటా యించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కార్య క్రమంలో చేబ్రోలు మండల టిడిపి అధ్యక్షులు మైలా వెంకటరామ రాజు, మండల రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సింహాద్రి సాం బయ్య, బిసి సెల్‌ అధ్యక్షులు ఉయ్యూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.