30న ప్రారంభోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ
ప్రజాశక్తి - ఉంగుటూరు
చేబ్రోలులో జగనన్న ఇళ్ల కాలనీ పనులను ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శుక్రవారం పరిశీలించారు. రాష్ట్రవాప్తంగా పెద్ద సంఖ్యలో జగనన్న ఇళ్లు ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విధితమే. ఈక్రమంలో జిల్లాలోని చేబ్రోలులో జగనన్న కాలనీని ఈనెల 30న ప్రారంభించేందుకు జరుగుతున్న పనుల పురోగాభివృద్ధిని హౌసింగ్ అధికారులతో కలిసి ఎంఎల్‌ఎ సమీక్షించారు. అంతర్గగ రోడ్డు, ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు రూ.48 లక్షలతో సత్వరమే పూర్తయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఇ సోమేశ్వరరావు, ఎఇ సురేష్‌బాబు, వైసిపి మండల కన్వీనర్ మరడా మంగారావు, మాజీ సర్పంచి కర్ణం బుజ్జి, ఎంపిటిసి సభ్యులు మనసాల నాగమణి, రాయి లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సత్తార్ సాహెబ్, ఆకుల రాజ పాల్గొన్నారు.










