May 29,2022 09:49

తాడు వదిలేసిన బొంగరంలా
వదిలెళ్ళిన చోటే
పడి ఉంటుందనుకున్నారు !
కాలం గిర్రున
బొంగరంలా తిరిగింది !

ఇప్పుడు
వెనక్కి తిరిగి చూస్తే
పడిపోయిన చోటనే
పల్లాన్ని వెతుక్కోని
వెనుతిరిగి చూడని ఓ ప్రవాహాం అయింది !

తన ప్రతి మలుపూ
తరచి చూస్తే ఓ పాఠమే !
కలిపి లిఖిస్తే
ప్రతి ఒంటరి మహిళ 'జీవిత' చరిత్రే !!

ఇక ఈ లోకంలో
బతుకు లేదని
తనువు చాలిస్తున్న ప్రతివాడూ
చదవలేకపోయిన పుస్తకమే !!

తిప్పాన హరిరెడ్డి
9493832412