Nov 15,2023 22:48

మాట్లాడుతున్న ఉపేందర్‌రెడ్డి

ప్రజాశక్తి, టెక్కలి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం నేర్పించాలని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర పరిశీలకులు ఉపేందర్‌ రెడ్డి కోరారు. టెక్కలి డివిజన్‌ స్థాయి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల రెండు రోజుల శిక్షణా సదస్సు బుధవారంతో ముగిసింది. స్థానిక బాలికోన్నత పాఠశాలలో జరిగిన శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ఉపేందర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివరినాటికి ఉపాధ్యాయులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నారు. రాష్ట్ర మోనిటరింగ్‌ అధికారి కల్పనా సేల్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు లెసన్‌ ప్లాన్‌, టీచింగ్‌ నోట్స్‌ ఉండాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న అంశాలపై ప్రతి ఒక్కరు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. టెక్కలి డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారిని గార పగడాలమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో రాష్ట్ర రిసోర్స్‌పర్సన్‌ ప్రవీణ్‌ కుమార్‌, నలినీకాంత్‌, డివిజన్‌లోని 16 మండలాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.