కడప అర్బన్ : విద్యార్థులు చదు వుతోపాటు క్రీడ ల్లోనూ రాణిం చాలని ఇంటాక్ కడప చాప్టర్ కన్వీ నర్ కె. చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షులు పోతుల వెంక టరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లోముందస్తు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటాక్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా శారీరకంగా, మానసికంగా దఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అన ంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారం భించారు. 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని, ఫైనల్లో విన్నర్స్, రన్నర్స్‌కు ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య ఉపాధ్యక్షుడు పద్మప్రియ చంద్రారెడ్డి, కార్యదర్శి కొండూరు జనార్దన్ రాజు, ఇంటాక్ సభ్యులు సంజీవరెడ్డి ,భారవి, కొండారెడ్డి, సొహైల్, అధ్యాపకుడు హజరతయ్య పాల్గొన్నారు.










