May 02,2023 19:35

క్రీడ సామగ్రిని అందజేస్తున్న ప్రకాష్‌ జైను

ప్రజాశక్తి - ఆదోని
చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు కూడా అవసరమని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని కళాభారత్‌ సేవా సమితి కార్యాలయంలో ఉచిత కరాటే, యోగా, బాక్సింగ్‌, వెపన్స్‌ ఏరోబిక్స్‌ అంశాలపై ఉచిత శిక్షణ ప్రారంభించారు. ప్రకాష్‌ జైన్‌ మాట్లాడుతూ... మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందన్నారు. సంప్రదిస్తే తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. కేశవ మాస్టర్‌ మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ జైన్‌ కళాభారత్‌ సేవా సమితికి రూ.20 వేల విలువ చేసే క్రీడా పరికరాలను వితరణ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణలో పాల్గొనే వారు గట్టు వీరయ్య శెట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సంప్రదించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.