ప్రజాశక్తి - చీరాల
చదువు కోవడం ద్వారానే అభివృద్ది సాధించగలమని ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాలపర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రోటరీ కమ్యునిటీ హాలులో ఎరుకల సేవా సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఐక్యతతో అన్యాయాన్ని శాంతియుతంగా ప్రతిఘటించాలని కోరారు. ఉన్నత విద్య చదువుకుంటేనే జాతి అభివృద్ది చెందుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సమావేశానికి జిల్లా ఇంచార్జ్ బోగిరి శ్రీకాంత్ మిత్ర హాజరయ్యారు. బాపట్ల జిల్లా అధ్యక్షులుగా పాలపర్తి రామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కటారి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తుమ్మ శ్రీనివాస్, జిల్లా చైర్మన్‌గా దేవరకొండ రాము, యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా బచ్చు భరత్ తోపాటు మరో 52మందితో కమిటీ ఎన్నిక చేశారు.










