Nov 07,2023 00:03

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే
ప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ: ప్రతి విద్యార్థీ చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్‌పి ఉన్నత పాఠశా లలో రాష్ట్రస్థాయి రబ్బి బాల్‌ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టు ఎంపిక క్రీడా పోటీ లను లాంఛనంగా ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని దీనికి కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వంచే విద్యార్థులకు, క్రీడాకారులకు అందు తుందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బుచ్చినాయుడు కండ్రిగలో జరుగుతున్న క్రీడా పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులకు స్పోర్ట్స్‌ టి షర్ట్స్‌ యూనిఫామ్‌ అందించిన దాత వరదయ్యపాలెం మండ లం అంబూరు గ్రామానికి చెందిన ఎన్నారై నందకిషోర్‌ను సన్మానించి అభినం దనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకున్న యోగ ప్రదర్శన
బుచ్చినాయుడు కండ్రిగ జడ్‌పిపాఠశాలలో సోమవారం నిర్వహించిన క్రీడా పోటీలలో శ్రీకాళహస్తి కి చెందిన పదవ తరగతి విద్యార్థిని శివాని యోగా ప్రదర్శన ఆకట్టుకుంది. శివాని ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చే క్రీడా విభాగం లో ఉత్తమ యోగ ప్రదర్శన అవార్డు ను అందుకుంది. శివానిని ఎమ్మెల్యే ఆదిమూలం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఆరని విద్యానాథరెడ్డి, మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ సంధ్య, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్‌ రెడ్డి, గురునాథం, ప్రధానోపాధ్యాయులు రమణయ్య, పీఈటీలు కిషోర్‌ మస్తాన్‌, హరిబాబు, పార్లపల్లి ఎంపీటీసీ బండి మునికష్ణారెడ్డి, కొత్తపాలెం సర్పంచి హరిప్రసాద్‌, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యా యులు వైసిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత రం బుచ్చినాయుడు కండ్రిగలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చంగమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే నష్టపరిహారం చెక్కును అందించారు.