
ప్రజాశక్తి-తర్లుపాడు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళలు వంటి విభిన్న అంశాల్లో రాణించాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు వై.శ్రీనివాసరావు పాఠశాలను గురించి శాసనసభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు మాజీ ఎంపిపి కీ||శే|| కుందురు వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు కుందురు శ్రీకాంత్‌రెడ్డి వాటర్‌ఫ్యూరిపైర్‌ను, మాజీ ఎంపిపి కుందురు వెంకటరెడ్డి, చెరుకుల కాశిరెడ్డి గార్ల జ్ఞాపకార్ధం, మాన్యకర్, వైజాగ్ వారి జన్మదినం సందర్భంగా క్రీడాకారులయిన విద్యార్థులకు క్రీడా దుస్తులను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా దాత కుందురు శ్రీకాంత్, శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వై.శ్రీనివాసరావు చిరుసత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు సూరెడ్డి భూలక్ష్మి, మురారి వెంకటేశ్వర్లు, కుందురు సత్యనారాయణరెడ్డి, పొట్లపాటి వెంకటయ్య, ఎంపిటిసి మురారి సుబ్బయ్య, గ్రామ సర్పంచ్, కుందురు శ్రీకాంత్, రిటైర్డ్ టీచర్ రావి వెంకటరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.