Nov 27,2022 21:23

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
          విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, చక్కని భవిష్యత్‌కు మార్గం ఏర్పాటు చేసుకోవాలని స్థానిక సిఐ బాలసురేష్‌ బాబు సూచించారు. స్థానిక ఒకటో వార్డు గరుడ పక్షి నగర్‌ ఎంపిపి పాఠశాలలో దాతలు గుండపనేని నరసింహారావు భార్య సత్యవతి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారన్నారు. చదువుకు చిహ్నమైన సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ హర్షణీయమన్నారు. ఆనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మార్గరైట్‌, సిబ్బంది సిఐని శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకరావు, ఉపాద్యాయ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.