చదువుల బాధ్యత జగన్ మామయ్యదే : ఎమ్మెల్యే
ప్రజాశక్తి- నంద్యాల కలెక్టరేట్
పేద విద్యార్థుల చదువు బాధ్యత అంతా జగన్ మావయ్య చూసుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని కెఎన్‌ఎం మున్సిపల్ హైస్కూల్, ఉన్నత పాఠశాలలో ఆల్ మైనార్టీస్ ఎంప్లారు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల డివిజన్ పరిధిలోని ఉర్దూ మీడియం పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నీసా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, డిక్షనరీ అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించిన ఉపాధ్యాయులకు, ప్రోత్సాహం అందించిన విద్యార్థుల తల్లిదండ్రులను అతిథులు సన్మానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందుకోవాలని, నంద్యాలకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగి శెట్టి శ్రీధర్, పామ్ షావలి, కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, కో ఆప్షన్ మెంబర్ సలాముల్ల, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్దం శివరాం, స్కూల్ హెచ్‌ఎం అసదుల్లా హుస్సేన్, ఆల్మేవా ప్రతినిధులు అబులైజ్, ఇమ్రాన్ పాష, మాలిక్ బేగ్, ముర్తుజ, అమీరుద్దీన్, షేక్ మహమ్మద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










