ప్రజాశక్తి-పాడేరు: ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులను చదువు పేరుతో మానసికమైన ఒత్తిడికి గురి చేయరాదని, దీంతో వారి మనుగడకు ముప్పు కలిగే పరిస్థితి ఉంటుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే ప్రభుదాస్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గత జూన్ నెల 12న పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత అప్పుడే విద్యార్థులపై పరీక్షల పేరుతో గురుకుల కళాశాలలో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఈ కారణంగానే అరకువ్యాలీ గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు సిద్దమైందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా సమగ్ర విచారణ జరిపించి, భాద్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. విద్యార్థులు భయాందోళనలకు గురి కాకుండా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. వర్షా కాలంలో విద్యార్థులకు సీజన్లు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, వసతి గృహలు, కళాశాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చిన్నారావు, ధనలక్ష్మి, పాల్గొన్నారు.










