Oct 13,2023 11:12

ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కడవకల్లు గ్రామానికి చెందిన 9 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయినట్లు రైతులు తెలిపారు. ముని రెడ్డి మూడు మోటర్లు, కొండారెడ్డి ఒకటి, వెంకట్ రెడ్డి 1 గంగిరెడ్డి ఒకటి మరికొంత మంది రైతులవి గురువారం రాత్రి చోరీ అయినట్లు రైతులు తెలిపారు. గతంలో కూడా చోరీలకు గురైనట్లు రైతులు తెలిపారు. నిన్న డ్రిప్పు వైరు, నేడు కేబుల్ వైరుల చోరీలతో రైతులు బెంబేలవుతున్నారు.