Mar 20,2023 16:32

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

చౌడేశ్వరి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం- ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి - బనగానపల్లె

        నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నందవరం చౌడేశ్వరి దేవి దేవస్థానం బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవస్థానానికి వచ్చిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కి ఆలయ ఈవో రామానుజన్ ఆధ్వర్యంలో పూర్ణకుంబాభిషేకంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే కాటసాని అమ్మవారికి కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కాటసాని పరిశీలించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ  ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారధి ,జ్యోతి, రథ,వసంతోత్సవం ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు .జ్యోతి మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.జ్యోతి మహోత్సవం సందర్భంగా గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.గ్రామ పంచాయతీ శాఖ అధికారుల పాత్ర కీలకమని కాబట్టి ప్రతి  అధికారి  ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జ్యోతి మహోత్సవాలను విజయవంతం చేయాలని  ఆదేశించారు.  కర్నూలు, కడప అనంతపురం జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు  మంచినీటి వసతి, ఎలక్ట్రిసిటీ ,  పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ,భక్తుల రాకపోకలకు ఆర్టీసీ శాఖ ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వారి ఆరోగ్యం కొరకు మెడికల్ సిబ్బంది  జాగ్రత్తగా తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు.అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో  భక్తులు హాజరవుతారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.    ఈ కార్యక్రమంలో నందవరం చౌడేశ్వరి దేవి పాలకమండలి మాజీ చైర్మన్ పి ఆర్ వెంకటేశ్వర రెడ్డి, ఆలయ ఈవో వీఎల్ఎన్ రామానుజన్, ఎంపీడీవో  శివరామయ్య, సీఐ సుబ్బరాయుడు ,నందివర్గం ఎస్సై రామాంజనేయ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయి కృష్ణ, విద్యుత్ రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్ గజ్జప్ప, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.బి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.