Jul 09,2023 21:35

చైతన్య రథయాత్రలో పాల్గొన్న టిడిపి నాయకులు

మదనపల్లె అర్బన్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రతో టిడిపి శ్రేణుల్లో సరికొత్త జోష్‌ను నింపుతోంది. ఆదివారం మదనపల్లి నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రధయాత్ర కొనసాగింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్థి గంట నరహరి, మదనపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్‌ చినబాబు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, నాయకులు యశస్విరాజ్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్‌.ఎం.ఫర్వీన్‌ తాజ్‌, రాజంపేట పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, రాజంపేట పార్లమెంట్‌ బిసి సెల్‌ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి శివ,రామసముద్రం మండలం అధ్యక్షులు విజరు గౌడ్‌, మాజీ అధ్యక్షులు కృష్ణంరాజు యాదవ్‌, నాయకులు రాటకొండ మధుబాబు, మదనపల్లి పట్టణ అధ్యక్షులు భవాని ప్రసాద్‌, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ఆర్‌.జె.వెంకటేష్‌ పాల్గొన్నారు.