Aug 26,2023 23:37

చైర్మన్‌ ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

xప్రజాశక్తి-అరకులోయ :విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డి. వి.జి. శంకర్‌రావు తెలిపారు. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా అరకులోయను సందర్శించిన ఆయన ఎండపల్లి వలసలోని ఈఎంఆర్‌ఎస్‌లో నిర్వహించిన స్టేట్‌ లెవెల్‌ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కల్చరల్‌ ఫెస్ట్‌లో మాట్లాడారు. విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి అభివృద్ధితో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, మంచి వ్యక్తిగా గుర్తింపు పొందవచ్చని ఆయన అన్నారు. తోటి వ్యక్తికి సహాయపడే వ్యక్తిత్వం కలిగి ఉండాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.28 ఈఎంఆర్‌ఎస్‌ స్కూళ్లకు చెందిన కల్చరల్‌ ఫెస్ట్‌ అరకులో నిర్వహించడం అభినందనీయమన్నారు.తాను విద్యార్థి దశ నుండే పద్యాలు, కథలు, కవితలు రాసానని తెలిపారు.
ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, గిరిజన ద్యార్థుల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థుల్లో మంచి ప్రతిభ ఉందని వాటిని ఉపయోగించుకొని పాఠశాలలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆయన సూచించారు, ఈనెల 28 వరకు నిర్వహించనున్న ఈ కల్చరల్‌ ఫేస్ట్‌ కి 14 ఈవెంట్స్‌ లు నిర్వహించనున్నారు. అనంతరం ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డి.వి. జి. శంకర్రావుకు ఈ ఎం ఆర్‌ ఎస్‌ ఉపాధ్యాయ బృదం ఘనంగా సత్కరించారు. అరకులోయ ఈఎంఆర్‌ ఎస్‌.ప్రిన్సిపల్‌ భాస్కర్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యులు రామలక్ష్మి, లిల్లీ సురేష్‌, మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ నర్సింగ్‌ రావు, అరకులోయ జడ్పిటిసి శెట్టి రోషిని, ఎంపీపీ ఉషారాణి, పద్మాపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ సుస్మిత, ఎంపీటీసీ దురియ ఆనంద్‌ కుమార్‌, వైసిపి రాష్ట్ర సోషల్‌ మీడియా ప్రతినిధి తడబారికి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.