Mar 31,2023 23:53
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: చార్లెస్‌ డార్విన్‌ ట్రస్ట్‌ సేవలు నిరూపమానం అని బాపట్ల ఆర్టీసి డిపో మేనేజర్‌ టీ అజిత కుమారి అన్నారు. ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్‌ మల్లికార్జునరావు జ్ఞాపకార్థం ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి డీఎం మాట్లాడారు. మొత్తం 15 రకాల మందులతో కూడిన ప్రథమ చికిత్సకు అవసరమయ్యే కిట్లు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కిట్లను ప్రతి బస్సులో అందుబాటులో ఉంచుతామన్నారు. అత్యవసరమైన సమయాలలో చికిత్సకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు కుమారుడు రాంమోహన్‌, గ్యారేజి ఇన్‌ఛార్జి రామకృష్ణ, సూపర్‌వైజర్‌ బి తిరుమల రెడ్డి, ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌ పి నాగేశ్వరరావు, శాంతారాం, అశోక్‌, దర్శి నాగేశ్వరరావు, గోవర్ధన్‌రావు, జీ శ్రీనివాసరావు, అశోక్‌ పాల్గొన్నారు.