చాపరాయికి వచ్చిన పర్యాటకులు
ప్రజాశక్తి- డుంబ్రిగూడ: మండలంలో పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంకు ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో పర్యాటకుల తాకిడితో చాపరాయి జలపాతం సందడిగా మారింది. జలపాతంలో పర్యాటకులు సరదాగా జారుతూ స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. కుటుంబ సమేతంగా జలపా తాన్ని తిలకిస్తూ, ఫోటోలను తీయించుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.










