చాంబర్ ఆఫ్ కామర్స్ జోన్ కమిటీ చైర్మన్‌గా.. ఘనంగా కెవి చౌదరి ప్రమాణ స్వీకారోత్సవం
చాంబర్ ఆఫ్ కామర్స్ జోన్ కమిటీ చైర్మన్‌గా..
ఘనంగా కెవి చౌదరి ప్రమాణ స్వీకారోత్సవం
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఫెడరేషన్ రాయలసీమ జోన్ కమిటీ చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండిస్టీ ఫెడరేషన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, మాజీ అధ్యక్షులు కష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన జోన్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ప్రముఖ పారిశ్రామికవేత్త కెవి చౌదరి మాట్లాడుతూ వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ఈ కమిటీ ముందుండి పరిష్కరించేందుకు తగిన కార్యాచరణతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తిన ముందుండి పోరాడతామన్నారు. వైస్ చైర్మన్ గా కె. రఘురామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్, రాయలసీమ ఉపాధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, డైరెక్టర్ రజిత రెడ్డి, రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు పివి.రత్నం, రాయలసీమ, తిరుపతి జిల్లాలలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లోని వ్యాపారస్తులు, తిరుపతిలోని 30కిపైగా వ్యాపార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.










