Oct 05,2023 22:25

ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జోన్‌ కమిటీ చైర్మన్‌గా..
ఘనంగా కెవి చౌదరి ప్రమాణ స్వీకారోత్సవం
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం)

ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఫెడరేషన్‌ రాయలసీమ జోన్‌ కమిటీ చైర్మన్‌ గా ప్రముఖ పారిశ్రామికవేత్త కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండిస్టీ ఫెడరేషన్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, మాజీ అధ్యక్షులు కష్ణ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన జోన్‌ కమిటీ చైర్మన్‌ గా ఎన్నికైన ప్రముఖ పారిశ్రామికవేత్త కెవి చౌదరి మాట్లాడుతూ వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ఈ కమిటీ ముందుండి పరిష్కరించేందుకు తగిన కార్యాచరణతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తిన ముందుండి పోరాడతామన్నారు. వైస్‌ చైర్మన్‌ గా కె. రఘురామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్‌, రాయలసీమ ఉపాధ్యక్షులు విజయకుమార్‌ రెడ్డి, డైరెక్టర్‌ రజిత రెడ్డి, రాష్ట్ర మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పివి.రత్నం, రాయలసీమ, తిరుపతి జిల్లాలలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లోని వ్యాపారస్తులు, తిరుపతిలోని 30కిపైగా వ్యాపార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం