భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కండి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా నాయకులు పి రామరాజు అన్నారు. బుధవారం రాజవొమ్మంగిలో భవననిర్మాణ కార్మికుల మొదటి మండల మహాసభ ఆసంఘం మండల నాయకులు పి శ్రీను అద్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్న పట్టించుకునే నాధుడే కరువైయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు,భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు నిధులు 800 కోట్ల రూపాయలు వారికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లైములు, ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్ సౌకర్యం తోబాటు నిరంతరం శ్రమించే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మండల కమిటీ ఎన్నిక జరిగింది, అధ్యక్ష, కార్యదర్శులుగా కలవపల్లి రాంబాబు, పప్పల శ్రీను, ఆఫీస్ బేరర్స్ గా ఎస్ నాగు,వి భద్రం,ఎన్ రామకృష్ణ, పి ప్రసాద్, డి రాము, మరో 10మంది సభ్యులుగా ఎన్నికైయ్యారు. ఎన్నికై కమిటి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై భవిష్యత్ పోరాటాలకు సిద్దం కావాలని రామరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం సభ్యులు పండు, జి శ్రీను, వై శివ, సీహెచ్ రాంబాబు, ఎం శ్రీనువాస్, ఎన్ అచ్చారావు తదితరులు పాల్గొన్నారు.










