Jul 30,2023 16:50

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నేముత్తేరిలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ మీటింగు ఆదివారం జరిగింది. ఈ మీటింగుకు కె.సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల తిరుపతి జిల్లా అధ్యక్షులు సుంకర అల్లెయ్య మాట్లాడతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి చట్టరీత్యా వారికే చెందాలని సుప్రీమ్ కోర్టు జడ్జిమెంటు ఇచ్చినా సంక్షేమ పథకాల రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయడము లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వము వేల కోట్లు ఫండును దారి మళ్ళించిందని అన్నారు. ఇది కార్మికుల హక్కుల్ని కాలరాయడమేనన్నారు. ఏది ఏమైనా భవన నిర్మాణ కార్మికుల సంవత్సరము 30/- యూనియన్ సభ్యత్వము చెల్లించాలని అలాగే సంక్షేమ పథకాలు పొందాలంటే పాత సభ్యులు కార్డు రెన్యువల్ చేసుకోవాలని, కొత్త కార్డుకు రేషను కార్డు ఆధారుకార్డు మూడు ఫోటోలతో లేబరు ఆఫీసురకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సిఐటియు మండలం కార్యదర్శి కె.లక్ష్మయ్య మాట్లాడుతూ కార్మికులందరు సంఘటితంగా వుండి హక్కుల కోసము పోరాడాలన్నారు. వారందరికి సిఐటియు అండగా వుంటుందన్నారు. తదుపరి మూడు సంవత్సరాలకు నూతన కమిటీగా అధ్యక్షుడు కె.సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు రఘురామయ్య, కార్యదర్శి నాగరాజు, కోశాధికారిగా కె.ప్రభాకర్, ఉప కార్యదర్శులుగా భాస్కర్, రమేష్ మరియు పెంచలయ్య, వేణు, రమేష్ చెంగయ్య, రమణయ్య కమిటి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మీటింగుకు భవన నిర్మాణ కార్మికుల గౌరవ అధ్యక్షుడు ఎస్.సాంబశివయ్య, జిల్లా కమిటి సభ్యులు వేణురెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.