ప్రజాశక్తి-వీరులపాడు (ఎన్టీఆర్ జిల్లా) : ఎన్టీఆర్ జిల్లా నవంబర్ 1 మైలవరంలో జరిగే మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ జుజ్జూరు గ్రామంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో ప్రచార నిర్మించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ
భవన నిర్మాణ కార్మికులు మూడున్నర దశాబ్దాలు పోరాడి సాధించుకున్న భావన నిర్మాణం ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్యం చేసింది సంక్షేమ బోర్డు ద్వారా అందవలసిన పథకాలు నిలుపువేస్తూ సర్కిల్ 1214నీ ఇచ్చింది దీనితో రాష్ట్రంలోనూ వేలాది మంది కార్మికులు మంజూరైన పథకాలు డబ్బులు కార్మికులకు అందలేదు. వైయస్సార్ బీమా పేరుతో 381 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా దారి మళ్లించింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన చేపట్టడం జరిగిందని అన్నారు. కార్మికుల తరఫున సంక్షేమ బోర్డులు పథకాలు అందాలని కోరుతూ కోర్టులో కేసు వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. మైలవరంలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు రానున్న కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్తు నిర్ణయాలు తీసుకొని మరి అంత తీవ్రమైన పోరాటాలు చేయడానికి మహాసభ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోపిశెట్టి శంకరు, కలక నారాయణ, నాగులు పుల్లయ్య, సిఐటియు మండల కార్యదర్శి లాల్, అహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.










