Nov 12,2022 15:28

ప్రజాశక్తి - జీలుగుమిల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన రాష్ట్ర కమిటీ సభ్యునిగా చిట్టి బొమ్మ కొండలరావు ఎన్నికయ్యారు ఈనెల 10 ,11 తేదీలలో గుడివాడలో రెండు రోజులు జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కమిటీ 56 మందితో ఎన్నిక జరగగ జీలుగుమిల్లి మండలం నుంచి రాష్ట్ర కమిటీ లోకి కొండలరావు అవకాశం దక్కింది గత 30 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మిక రంగంలో పని చేస్తూ కార్మికుల హక్కుల కోసం నిర్వహించిన పోరాటాలలో మంచి పేరు తెచ్చుకున్నారు.రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల  సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు