ప్రజాశక్తి-రాజవొమ్మంగి : స్థానిక ఎంపిడిఓ కార్యాలయ సమీపంలో స్థానిక వెలుగు కార్యాలయము వద్ద మండల పరిషత్ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి మంజూరు అయిన మంచినీటి బోర్ ని స్థానిక ఎంపీడీఓ కె బాపన్నదొర తదితరులు సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాపన్నదొర మాట్లాడుతూ, బోరు ఏర్పాటు చేయడం ద్వారా వెలుగు కార్యాలయ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు, ఉపాధి హామీ కార్యాలయ సిబ్బందికి, అలాగే ఎంఆర్సి సిబ్బందికి మంచినీటి ఇబ్బంది, టాయిలెట్స్ లో రన్నింగ్ వాటర్ ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










