Apr 30,2023 16:03
  •  పార్టీ  శ్రేణులు ఘన నివాళులు 

ప్రజాశక్తి-విఅర్ పురం : కమ్యూనిస్ట్ పార్టీ తొలి తరం తెలంగాణ వీరుడు ఉద్యమ నేత  బీమయ్య 20వ వర్ధంతిని అమర జీవి  స్వగ్రామం వి ఆర్ పురం మండలంలోని అడవి వెంకన్న గూడెంలో ఆయన స్మారక స్థూపం వద్ద  పార్టీ  శ్రేణులు కార్య కర్తలు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి వారికి విప్లవ జోహార్లు నివాళులు అర్పించారు. స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన సిపిఎం జెండాను ఎంపిపి కారం లక్ష్మి ఎగుర వేశారు అలాగే. తెలంగాణ వీరుడు అమరజీవి బొప్పెన భీమయ్య స్మారక స్థూపం వద్ద చిత్ర పటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ తెలంగాణలో తొలత ఉద్యమ నేత అయిన బొప్పెన భీమయ్య ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని అలాగే తను ప్రజల కోసం ఏ విధంగా పోరాడారొ ప్రతి ఒక్కరూ తనని మార్గదర్శకంగా తీసుకోవాలని ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగి చిత్తశుద్ధితో పనిచేయాలని వారు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తదుపరి స్మారక స్థూపానికి పార్టీ మండల కార్యదర్శి సోయం. చిన్నబాబు, మాజీ సర్పంచ్ లు కుంజా నాగిరెడ్డి, ఆసు లక్ష్మయ్య, వడ్లాది రమేష్, కారం సుందరయ్య, గ్రామ సిపిఎం శాఖ సభ్యులు గ్రామలొ మహిళలు కార్యకర్తలు నివాళులర్పించారు.