Dec 21,2022 16:03

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:- మండలంలోని ఇల్లు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐటిడిఏ ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మంది గర్భిణీ మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని కె కరుణ మాట్లాడుతూ గర్భిణ మహిళలు ఆకుకూరలు,గుడ్లు, పాలు తోపాటు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భిణీలకు గ్రామంలో ఎప్పటికప్పుడు ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ రక్తహీనత ఏర్పడకుండా మాత్రలను ఇవ్వడంతో పాటు ప్రతినెల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.ప్రసవ సమయంలో ప్రతి ఒక్క గర్భిణీలు దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి సురక్షితంగా ప్రసవించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,గర్భిణీలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.