ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని వారం రోజులు పాటు జరిగే వార్షికోత్సవాలలో మొదటిరోజు పుత్తూరు మున్సిపాలిటీ హిమజ స్కూల్ నందు అభిమానుల సమక్షంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో మునిపెన్నడూ లేనివిధంగా ఎన్టీఆర్ అభిమానల సమక్షంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ, ఆదివారం సుమారుగా 105 మందికి రక్తదాన శిబిరం మరియు వారం రోజులలో రాజకీయాలకు అతీతంగా పలు దేవాలయాలలో ఎన్టీఆర్ పేరు మీదగా ఘనంగా పూజలు నిర్వహించి, పేదలకు మహా అన్నదానం చేస్తున్నామని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బు శెట్టి, పిండి కృష్ణ, పద్దు, మణి, హేమంత్ హరి, హేమకుమార్, దుర్గప్రసాద్, అభిఐతం, భాస్కర్, ఉదయ్, కౌశిక్,గాంధీ, శంకర్, మనోజ్ సుధాకర్, నిరంజన్ ఎన్టీఆర్ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.










