
హైదరాబాద్ : డైలాగ్ కింగ్ సాయికుమార్ పోలీస్ స్టోరీ చిత్రంతో నటునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తనయుడు ఆది కూడా తండ్రిబాటలోనే తొలిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ చిత్రంలో ఖాకీ బట్టలు వేసుకున్న ఆది తన నటనతో మెప్పిస్తున్నారు. శనివారం చిత్రయూనిట్ బ్లాక్ మూవీ టీజర్‌ని విడుదల చేసింది. 'కంటికి కనిపించని కాలయముడు.. ఊహించని కపట నేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు..' అని ఆది సాయికుమార్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. దీన్ని చూస్తే.. పోలీస్ ఆఫీసర్ అయిన ఆది నేరస్తుడిని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. 'కాలసర్పంలా దూసుకొస్తున్న సమస్యల నుంచి బయటకు రావడానికి దారి కోసం వెతుకుతున్నా.. విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు.. మరి నేను వెతుకున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?' అనే డైలాగ్ 'బ్లాక్' నేపథ్యాన్ని తెలియజేస్తోంది. అలాగే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డైలాగ్‌లు చెప్పి, ఫైట్ చేయడానికి నేనేమైనా పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోనేంట్రా అని టీజర్‌లో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీబీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
టీజర్ https://youtu.be/zlkd_ksA5Wk