Aug 01,2021 13:57

అమరావతి : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించి పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ షో సెప్టెంబర్‌ 5 నుండి ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం బిగ్‌బాస్‌ 5 తెలుగు ప్రోమోను స్టార్‌ మా రిలీజ్‌ చేసింది. మరోవైపు బిగ్‌ బాస్‌ సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు ప్రస్తుతం పూర్తి కావచ్చాయని సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బిగ్‌ బాస్‌ 5 సీజన్‌ త్వరలోనే ప్రారంభించాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు అనుకుంటున్నారట.

ఈసారి హోస్ట్‌గా నాగార్జున రాకపోవచ్చు..
ఇక బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌ను ఎన్‌టిఆర్‌ హోస్ట్‌ చేశారు. రెండవ సీజన్‌ను నాని హోస్ట్‌ చేశారు. ఇక మూడు నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేసిన విషయం విదితమే. అయితే ఈ సారి సినిమాలలో బిజీ అయిన కారణంగా 5 వ సీజన్‌లో మాత్రం నాగార్జున అందుబాటులో ఉండరని తెలుస్తోంది. నాగార్జున చేయాల్సిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో పాటు సూపర్‌ హిట్‌ సినిమా మనంకు కూడా సీక్వెల్‌ రాబోతోందట. దీంతో ఆయన ఈ సీజన్‌కు రాకపోవచ్చని.. అంటున్నారు.

5 సీజన్‌లో కాస్తా గ్లామర్‌డోస్‌ పెంచుతున్నారట..
ఇప్పటికే నాలుగు సీజన్లను బిగ్‌బాస్‌ తెలుగు షో పూర్తిచేసింది. నాలుగవ సీజన్‌లో ఎక్కువుగా సోషల్‌ మీడియా స్టార్స్‌ ఉండటంతో బిగ్‌ బాస్‌ అభిమానులు కొంత అసహనాన్ని వ్యక్తపరిచారు. ఈసారి మాత్రం పాపులర్‌ అయిన నటీనటులను తీసుకుంటున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అంతేకాదు ఈసారి కాస్తా గ్లామర్‌ డోస్‌ను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బిగ్‌బాస్‌ 5 సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా అది వాయిదా పడింది. సెప్టెంబర్‌ 5 న బిగ్‌బాస్‌ 5 సీజన్‌ ప్రారంభం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కంటెస్టెంట్‌ లిస్ట్‌ ఫైనల్‌..
ఈ ఐదో సీజన్‌ కోసం అప్పుడే కంటెస్టెంట్‌ లిస్ట్‌ను నిర్వాహకులు ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. యాంకర్‌ రవి, యాంకర్‌ వర్షిణి, జబర్దస్త్‌ గెటప్‌ శ్రీను, రఘు మాస్టర్‌, సింగర్‌ మంగ్లీ, న్యూస్‌ యంకర్‌ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్‌ యాక్ట్రెస్‌ నవ్య స్వామి, యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, ప్రేమకావాలి హీరోయిన్‌ ఈషా చావ్లా, టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎవరు వెళతారో.. చూడాలి మరి !

బిగ్ బాస్ 5 ప్రోమో కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=i69fpqjZynE&t=15s